పీఎం శ్రీ పాఠశాలలో ముందస్తు వినాయక వేడుకలు

NLG: చిట్యాల మండలం వెలిమినేడు పీఎం శ్రీ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థిని విద్యార్థులు ముందస్తు వినాయక వేడుకలను జరుపుకున్నారు. మట్టి ప్రతిమలను తయారు చేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు తల్లిదండ్రులకు పర్యావరణం గురించి అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ప్రతిమలను నీటిలో నిమజ్జనం చేశారు.