కౌలు రైతులకు అందని రుణాలు

కౌలు రైతులకు అందని రుణాలు

విజయనగరం: జిల్లాలోని కౌలు రైతులకు బ్యాంకు రుణాలకు నోచుకోలేదు. నిబంధనల పేరిట బ్యాంకర్లు మోకాలడ్డటంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కౌలు రైతుల గుర్తింపే అరకొర అనుకుంటే, గుర్తించిన కౌలుదారుల్లో 10 శాతం మందికి కూడా రుణాలు ఇవ్వలేదు. మరోవైపు పంటల మదుపుకోసం కౌలురైతులంతా ప్రయివేటు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు.