ఎరువుల సరఫరాకు చైనా గ్రీన్ సిగ్నల్

USతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ పర్యటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా భారత్‌కు ఎరువులు, అరుదైన ఖనిజాలు, బోరింగ్ యంత్రాలను సరఫరా చేసేందుకు చైనా అంగీకరించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఈ చర్చలు ఉపయోగపడతాయని జైశంకర్ తెలిపారు.