పిడుగు పడి ఆవు మృతి!

NRPT: పిడుగు పడి ఆవు మృతిచెందిన ఘటన అచ్చంపేట మండలం ఆంజనేయ తండాలో బుధవారం సాయంత్రం జరిగింది. ఆంజనేయ తండాకు చెందిన కేతావత్ బిచ్యకు చెందిన ఆవు గ్రామంలోని తన ఇంటికి కొంత దూరంలో వేప చెట్టు కింద ఉండగా అకస్మాత్తుగా పిడుగు పడడంతో ఆవు మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆవు విలువ దాదాపు రూ.60 వేల వరకు ఉంటుందని చెప్పారు.