'రైల్వే కాంట్రాక్టు కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలి'
PDPL: రైల్వే కాంట్రాక్టు కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై రామగుండం రైల్వే అధికారి స్వామికి సీఐటీయూ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ప్రతి నెల 7వ తేదీ లోపు వేతనాలు ఇవ్వాలని, వేతనాలు కార్మికుని బ్యాంకు ఖాతాలో జమా చేయాలని, 2 రోజుల ముందు వేతన స్లిప్‌లు అందించాలన్నారు.