సంజామల మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే
NDL: సంజామల మండల కేంద్రంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, బనగానపల్లె వైయస్సార్ పార్టీ పరిశీలకుడు భూమా కిషోర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వైసిపి కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు.