కూలిపోయే స్థితిలో జెన్కో ఆర్చ్

కూలిపోయే స్థితిలో జెన్కో ఆర్చ్

NLR: ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం HP పెట్రోల్ బంక్ సమీపంలో జెన్కో రోడ్డుపై ప్రమాదకర స్థితిలో ఆర్చ్ ఉంది. భారీ వాహనాలు, ఎక్కువ రద్దీగా ఉండే మార్గంలో ఆర్చ్ ఓరిగి పోయి కూలిపోయే స్థితిలో ఉండటంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. జెన్కో అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని థర్మల్ కేంద్రాల ఉద్యోగులు, ప్రయాణికులు కోరుతున్నారు.