పెద్దవాగు పరిసరాల్లో పులి అడుగుజాడలు
కొమరంభీం జిల్లా, పెంచికల్‌పేట్ మండలంలోని ఒడ్డుగూడ సమీపంలో ఉన్న పెద్దవాగు ఒడ్డున, ఈరోజు పెద్దపులి అడుగుజాడలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా వాగు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. పులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు."