'ఫిర్యాదుదారులతో అధికారులే మాట్లాడాలి'
VSP: విశాఖ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారంపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. సమస్యలపై ఫిర్యాదు చేసిన వారితో సంబంధిత శాఖల జిల్లాస్థాయి అధికారులే నేరుగా మాట్లాడాలి అని, దిగువ స్థాయి సిబ్బంది మాట్లాడ్డానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ నిర్వహించారు.