'హోంగార్డుకు సహోద్యోగుల స్ఫూర్తిదాయక ఆర్థిక సహాయం'
AKP: చోడవరం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పని చేసి ఇటీవల పదవీ విరమణ చేసిన చల్లపల్లి రామకోటేశ్వరరావుకు సహోద్యోగులు స్వచ్ఛందంగా ఒక రోజు డ్యూటీ అలవెన్సును విరాళంగా సమర్పించారు. రూ.4,00,530 చెక్కును ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం అందజేశారు. రామకోటేశ్వరరావు క్రమశిక్షణ, నిబద్ధతను ఎస్పీ ప్రశంసించారు.