వైన్ షాప్ వెంటనే తొలగించాలని మహిళల ధర్నా
ASF: కాగజ్ నగర్ మండలం ఈస్ గాం పంచశీల నగర్‌లో ఉన్న వైన్ షాప్ వెంటనే తొలగించాలని మహిళలు, గ్రామ ప్రజలు సోమవారం ధర్నా నిర్వహించారు. షాపు వద్దకు వచ్చే మందుబాబులు ఇళ్ల ముందు మూత్ర విసర్జన చేయడం, మహిళలతో అసభ్యంగా మాట్లాడటం వల్ల స్కూల్ పిల్లలు సైతం భయపడుతున్నారని తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి వైన్ షాప్ తరలించాలని డిమాండ్ చేశారు.