ఆ గ్రామంలో 40 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన కాంగ్రెస్

ఆ గ్రామంలో 40 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన కాంగ్రెస్

KMM: బోనకల్లు మండలంలోని నారాయణపురం గ్రామంలో 40 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి శ్రీనివాసరావు 200 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయం వెనుక కరివేద సుధాకర్ కృషి ఉందని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం సుధాకర్‌ను అభినందించి, సన్మానించారు.