పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు
అన్నమయ్య: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిమ్మనపల్లి మండలం జడ్పీ హైస్కూల్లో పునరావస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో, ఎస్సై, ఎంఈఓ పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. జాండ్రబైలు వద్ద చెక్ డ్యాం పొంగి రోడ్డుపై నీరు ప్రవహిస్తున్నందున తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రజలు నీటి ప్రవాహాలను దాటవద్దని, ప్రమాదాల బారిన పడకుండా ఉండాలన్నారు.