'ప్రభుత్వాలు మతం పేరుతో ప్రజల్లో చీలిక తెస్తున్నాయి'
KDP: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఖాజీపేట మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు దుంపలగట్టు మరియన్న పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మతం పేరుతో ప్రజల్లో చీలిక తెస్తున్నాయని హిందూ, క్రిస్టియన్స్, ముస్లిం అంటూ.. మత ఘర్షణలు పెడుతున్నారని వారు దుయ్యబట్టారు.