రూపాయి పతనం.. ప్రియాంక ఫైర్
రూపాయి విలువ రూ.90.43కి పడిపోవడంపై మీడియా ప్రశ్నించగా ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. 'నన్నెందుకు అడుగుతున్నారు.. వెళ్లి వాళ్లను(కేంద్ర ప్రభుత్వాన్ని) అడగండి' అని మండిపడ్డారు. మన్మోహన్ సింగ్ టైంలో వాళ్లు ఏం మాట్లాడారో మర్చిపోయారా అంటూ నిలదీశారు. రూపాయి ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోవడంపై తనను ప్రశ్నించడం ఏంటని మీడియాపై కూడా అసహనం వ్యక్తం చేశారు.