బ్రహ్మోత్సవాలకు రావాలంటూ మంత్రికి ఆహ్వానం

బ్రహ్మోత్సవాలకు రావాలంటూ మంత్రికి ఆహ్వానం

KNR: ఇల్లందకుంట మండల కేంద్రంలో శ్రీ సీతారామ చంద్రస్వామి మహోత్సవాలకు రావాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈనెల 25 నుంచి ఏప్రిల్ 6 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వారు తెలిపారు. కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఒడితల ప్రణవ్, ఆలయ ఛార్మన్ ఇంగిలే రామారావు, అర్చకులు శ్రీ శేషం వంశీధరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.