‘దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం’

‘దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం’

AKP: దివ్యాంగులకు ఇవాళ్టి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారిణి (ఆర్టీసీ) వి.ప్రవీణ తెలిపారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా కనీసం 40 శాతం అంగవైకల్యం కలిగిన వారు పల్లె వెలుగు, ఆల్‌ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చునన్నారు.