రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

VSP: మధురవాడ మహిళా పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీ.ఎం.పాలెం ఆర్.హెచ్ కాలనీకి చెందిన గొంప జస్వంత్ (20) మృతి చెందాడు. శుక్రవారం అర్ధరాత్రి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ జస్వంత్ తుదిశ్వాస విడిచాడు. పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.