రేషన్ బియ్యం పట్టివేత.. వ్యాన్ సీజ్

అనకాపల్లి జిల్లా కే. కోటపాడు మండలం గుల్లేపల్లి గ్రామంలో రేషన్ బియ్యం కొనుగోలు చేసి వ్యాన్‌లో తరలిస్తుండగా కోటపాడు పోలీసులు శనివారం రాత్రి 10 గంటలకు పట్టుకున్నట్లు ఎస్సై ధనుంజయ తెలిపారు. వ్యాన్‌లో లోడ్ చేసిన బియ్యం సుమారు రెండు టన్నులు ఉంటుందన్నారు. అనంతరం వ్యాన్ సీజ్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.