'గరికపాటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి'
KRNL: మధ్యాహ్న భోజన పథకంపై ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గుదిపి సామేలు తీవ్రంగా ఖండించారు. పేద విద్యార్థుల ఆకలిని అవహేళన చేయడం దురదృష్టకరమని అన్నారు. ఈ పథకం ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే కొనసాగుతుందని తెలిపారు. గరికపాటి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని,విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు.