టిఫిన్ సెంటర్లలో ధరల పెంపు.. కార్మికుల ఇబ్బందులు
KMM: ఏన్కూరు మండలంలోని పలు టిఫిన్ సెంటర్లలో ఇటీవల టిఫిన్ ధరలను అనూహ్యంగా పెంచడం సామాన్య ప్రజల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతకుముందు రూ.30కు అందిస్తున్న టిఫిన్ ప్లేటును ప్రస్తుతం రూ.40కు విక్రయిస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఒక్కసారిగా రూ.10 పెంపు చేయడం వల్ల రోజువారీగా టిఫిన్‌పై ఆధారపడే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.