తాడిచెర్లలో క్షుద్రపూజల కలకలం

BHPL: జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల పెద్దమ్మ గుడి తోళ్లపాయకు పోయే మెయిన్ రోడ్డు నుంచి బీసీ కాలనీ పోయే దారి మూడు దారుల వద్ద క్షుద్రపూజల కలకలం రేవుతున్నాయి. దీంతో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మూడు బజార్ల వద్ద ఒక ప్లేట్లో కుంకుమ, పసుపు ముద్దలతో పాటు గొర్రె పిల్లను బలిచ్చారు. ఉదయం పనులకు అటుగా వెళ్లినవారు చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.