'బహుళ పంటలతో అదనపు ఆదాయం'

PPM: రైతులు ఏకపంట విధానాన్ని పాటించటం కంటే బహుళ పంటల విధానం లేదా అంతర్పంటల విధానాన్ని అవలంబించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని పాచిపెంట మండలవ్యవసాయ అధికారి కే తిరుపతిరావు తెలిపారు. ఆదివారం పాంచాలి గ్రామంలో వరి గట్ల మీద కంది విత్తనాలను నాటిస్తూ పత్తిలో అంతర పంటగా వేసిన కంది వ్యవసాయ అధికారి పరిశీలించారు.