భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి నిత్యకల్యాణం

BDK: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం నిత్యకల్యాణం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి స్వామి-తాయారల దివ్య కటాక్షం కోసం భక్తులు ప్రార్థనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణ మహోత్సవాన్ని దర్శించి సీతారాముల దివ్య అనుగ్రహం పొందారు.