బాల సదనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలసదనాన్ని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న బాల సదనం భవన పరిసర ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పిల్లలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.