దొరబాబు మృతదేహానికి ఎమ్మెల్యే నివాళులు

దొరబాబు మృతదేహానికి ఎమ్మెల్యే నివాళులు

CTR: చింతూరు వద్ద ఘాట్ రోడ్‌లో జరిగిన ప్రమాదంలో తవణం పల్లె మండలానికి చెందిన వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో మృతి చెందిన నరసింహన పల్లెకు చెందిన దొరబాబు మృతదేహానికి ఎమ్మెల్యే మురళీమోహన్ శనివారం నివాళులర్పించారు. కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్ చౌదరి, మోహన్ నాయుడు పాల్గొన్నారు.