అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్సై

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్సై

KMM: అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్సై సంతోష్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 లారీలను నేలకొండపల్లి ఎస్సై సంతోష్ శనివారం పట్టుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు తనిఖీల్లో తేలడంతో లారీలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.