'పేర్లు మార్చడంలోనే చంద్రబాబు విజనరీ'
PPM: మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు, ప్రాజెక్టులు, నిర్మాణాలు, వ్యవస్థల పేర్లు మార్పు చేస్తున్నారని జీ.ఎల్ పురం ఎంపీపీ కుంబురుక దీన మయ్య ఎద్దేవా చేశారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితం,15 ఏళ్ల పాటు సీఎంగా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు తన విజనరీని ఇలా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. అయన ఇవాళ విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ తీసుకొచ్చిన పథకాలు పేర్లు మార్చుతున్నారని అన్నారు.