గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించడమే లక్ష్యం: కలెక్టర్

గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించడమే లక్ష్యం: కలెక్టర్

JGL: గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం బీర్పూర్ మండలం నర్సింహులపల్లెలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతి, హాజరు నమోదును తనిఖీ చేసిన కలెక్టర్, అర్హులైన ప్రతి కూలీకి పని కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.