'బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలి'

NDL: బాల్య వివాహాలపై విద్యావంతులు గ్రామాల్లో అవగాహన కల్పించాలని నంద్యాల డివిజన్ శక్తి టీం పోలీసులు కోరారు. ఈ మేరకు పోలీసు శాఖ అందిస్తున్న సేవలపై బండి ఆత్మకూరులోని పాఠశాలలో మంగళవారం అవగాహన కల్పించారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. అనంతరం శక్తి యాప్ నంబర్‌కు ఫోన్ కాల్ లేదా వీడియో కాల్ చేసి చెప్తే వెంటనే స్పందిస్తామని తెలియజేశారు.