కరెంట్ షాక్‌తో గొర్రెలు మృతి

ELR: కామవరపుకోట శివారు మంకెనపల్లి సమీపంలో కరెంట్ షాక్‌తో 4 గొర్రెలు మృతి చెందాయి. శనివారం తెల్లవారుజామున వీచిన గాలులకు కరెంట్ తీగలకు కట్టిన సపోర్టు వైరు తెగిపడింది. అవి నేరుగా గొర్రెలను తాకటంతో అక్కడికక్కడే చనిపోయాయి. గొర్రెల యజమాని సర్వేశ్వరరావు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ఘటనకు పరిహారం అందించాలని కోరుతున్నారు.