గుంటూరులో మాంసం విక్రయాలు నిషేధం

గుంటూరులో మాంసం విక్రయాలు నిషేధం

GNTR: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గాంధీ జయంతి సందర్భంగా గురువారం గుంటూరు నగరంలో మాంసం, చేపలు, చికెన్ అమ్మకాలు పూర్తిగా నిషేధమని బుధవారం కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి నాన్-వెజ్ విక్రయాలు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నగర పరిధిలోని అన్ని నాన్-వెజ్ దుకాణాలు ఈ ఆదేశాలు పాటించాలన్నారు.