ఆలయం బాత్రూమ్‌లో అమ్మాయిలు ఆత్మహత్య
గుజరాత్ సూరత్‌లో ఇద్దరు యువతులు కాలేజీకి అని వెళ్లారు. ఆ తర్వాత తిరిగి ఇళ్లకు వెళ్లలేదు. అమ్మాయిల కుటుంబీకుల సమాచారంతో పోలీసులు మొబైల్ ఫోన్లు ట్రాక్ చేశారు. స్వామినారాయణ్ ఆలయం వద్ద చివరిగా వారు ఉన్నట్లు గుర్తించారు. ఆలయంలోని CCTV ఫుటేజ్ ఆధారంగా బాత్రూమ్‌కు వెళ్లినట్లు గమనించారు. బాత్రూమ్ డోర్ పగులగొట్టి, లోనికి వెళ్లి చూడగా ఇద్దరు యువతులు మరణించి ఉన్నారు.