'మావోయిస్టులపై ఇది చరిత్రాత్మక విజయం'

ఆపరేషన్ కర్రెగుట్టపై కేంద్రహోంమంత్రి అమిత్ షా స్పందించారు. మావోయిస్టులపై పోరులో చరిత్రాత్మక విజయం సాధించామని తెలిపారు. త్వరలో భారత్ మావోయిస్టు రహిత దేశంగా మారుతోందని ఆకాంక్షించారు. అయితే తాము కేంద్రంతో చర్చాలకు సిద్ధమని మావోయిస్టులు లేఖ రాసిన విషయం తెలిసిందే.