ప్రత్యేక అధికారుల నియామకం
MDK: మనోహరాబాద్ మండలంలో గ్రామపంచాయతీలో రేపు నిర్వహించే గ్రామ సభలకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో బి. కృష్ణమూర్తి తెలిపారు. మనోహరాబాద్ మండలంలోని 17 గ్రామపంచాయతీలకు 17 మంది ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.