ఇరాన్‌తో భారత్ సహా పలు దేశాల ఒప్పందాలు

ఇరాన్‌తో భారత్ సహా పలు దేశాల ఒప్పందాలు

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌తో భారత్ సహా పలు దేశాలు కీలక ఒప్పందం చేసుకున్నాయి. దీంతోనే హర్మూజ్ జలసంధిని ఆయా దేశాల నౌకలు సురక్షితంగా దాటుతున్నట్లు ఆంగ్ల మీడియా తెలిపింది. ఈ ఒప్పందం తర్వాత జలసంధిని ఏకంగా 21 నౌకలు దాటినట్లు చెప్పింది. మార్చి మొదటి వారం నుంచి ఇప్పటి వరకు ఇన్ని నౌకలు ప్రయాణించడం ఇదే తొలిసారి కావటం విశేషం.