ఎరువుల కొరత.. జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

VZM: మండల స్థాయిలో MRO, SI, సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహశీల్దార్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం ప్రకటించారు. దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, RSKలను తనిఖీ చేయిస్తామన్నారు. షాపులకు సరఫరా అయిన ఎరువులు, పంపిణీ, నిల్వలపై వారం రోజుల్లో తమకు నివేదికను అందజేయాలన్నారు.