'సదరం శిబిరాలు సద్వినియోగం చేసుకోండి'

'సదరం శిబిరాలు సద్వినియోగం చేసుకోండి'

ASF: జిల్లాలో ఈనెల 13 నుండి 29 వరకు వివిధ తేదీల్లో సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సదరం శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యంగులు మీసేవ కేంద్రాల్లో యూడీఐడీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.