'సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి'

'సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి'

SDPT: జిల్లాలో సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని, వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా, మండల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.