నేడు ఈ గ్రామాలకు పవర్ కట్

నేడు ఈ గ్రామాలకు పవర్ కట్

KKD: రేఖవానిపాలెం ఫీడర్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎలక్ట్రికల్ ఈఈ వీరభద్రరావు తెలిపారు. మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించారు. దీంతో వి.కొత్తూరు, లోవకొత్తూరు, కే.వేలంపేట, రేఖవాణిపాలెం, మరువాడ గ్రామాల్లో విద్యుత్ ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.