విజయ్ కాటన్ మిల్లును సందర్శించిన కలెక్టర్

విజయ్ కాటన్ మిల్లును సందర్శించిన కలెక్టర్

NRPT: ఊట్కూర్ మండలంలోని విజయ్ కాటన్ మిల్లును కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మిల్లు ప్రాంగణంలో రైతులను పలకరించి, పత్తిని అమ్మడానికి ఎలా తీసుకువచ్చారని వాకబు చేశారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని వచ్చామని రైతులు తెలిపారు. అనంతరం కొనుగోళ్ల వివరాలను పరిశీలించిన కలెక్టర్, అధికారులకు తగిన సూచనలు చేశారు.