'అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి'
MNCL: శ్రీరాంపూర్ లోని ఆర్కే 6 హట్స్- 2 అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ 4వ డివిజన్ కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న సేవలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సుమలత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.