వైద్య పోస్ట్‌ల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించిన కలెక్టర్
ASF: TVVP ఆధ్వర్యంలో జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల భర్తీకి గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఇంటర్వ్యూలు నిర్వహించారు. కాగజ్ నగర్, బెజ్జుర్, జైనూరులో కాంట్రాక్టు పద్ధతిలో వైద్య పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ ఇంటర్వ్యూలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.