స్కూల్ పిల్లల ఆటో బోల్తా

NZB: నవీపేట్ మండల కేంద్రంలోని మంగళవారనాగపూర్ టర్నింగ్ వద్ద స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న పిల్లలు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.