సురక్షిత నీరు అందడం లేదు: ఐరాస

సురక్షిత నీరు అందడం లేదు: ఐరాస

తాగునీటిపై ఐరాస కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా ప్రజలకు సురక్షిత నీరు అందుబాటులో లేదని పేర్కొంది. 100 మిలియన్లకు పైగా ప్రజలు ఇంకా తాగునీటి కోసం నదులు, చెరువులు, కాలువలపైనే ఆధారపడుతున్నారని తెలిపింది. నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత అనేవి ప్రత్యేక హక్కులు కావని.. ప్రాథమిక మానవ హక్కులని చెప్పింది. ప్రతి నలుగురిలో ఒకరికి తాగునీటి సమస్య ఉందని వెల్లడించింది.