రాములవారి ఊరేగింపులో విషాదం

కడప: శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వేంపల్లి మండలం రామిరెడ్డిపల్లెలో విద్యుత్ తీగలు తగిలి చంద్రఓబుల్ రెడ్డి అనే వ్యక్తి మృతిచెందాడు. బుధవారం జరిగిన స్వామివారి ఊరేగింపులో ఇనుముతో చేసిన హనుమంతుడి విగ్రహానికి ఉన్న విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి చెందగా 10 మందికి గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.