అమ్మవారి జాతర ఆదాయం రూ.15,76,520
కోనసీమ: సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. 23 రోజులకు గాను హుండీ ఆదాయాన్ని లెక్కించగా, మొత్తం రూ.15,76,520 సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దేవదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు పారదర్శకంగా జరిగింది.