VIDEO: విద్యార్థి మృతిపై దర్యాప్తు
ప్రకాశం: సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి తౌషిక్ ఫిబ్రవరి 14న అనుమానస్పద మృతి చెందాడు. గతంలో ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే తల్లిదండ్రులు ఇది ముమ్మాటికి హత్యానని కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో శుక్రవారం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.