రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
NRML: మామడ మండలం దిమ్మదుర్తి బైపాస్ ఓవర్ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు దిమ్మదుర్తికి చెందిన దండుగుల సాయిరాం (23)గా గుర్తించారు.