'యూరియా కొరత తీర్చండి'

KRNL: పెద్దకడబూరులో రైతులకు యూరియా కష్టాలు తీర్చాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆనంద్ రాజ్ ఇవాళ డిమాండ్ చేశారు. గత 20 రోజులుగా మండలంలోని సొసైటీ చుట్టూ రైతులు కాళ్లు అరిగేలా తిరుగుతున్న యూరియా దొరకని దుస్థితి నెలకొంది అన్నారు. ఎరువుల సమస్యపై వ్యవసాయ అధికారులను సంప్రదించిన ఫలితం లేకుండా పోయిందన్నారు. యూరియాను సకాలంలో అందించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామన్నారు.